97 దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 వైరస్

97 దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 వైరస్

చైనాను వణికించిన కోవిడ్‌-19 ఇప్పడు ప్రపంచ దేశాలకు పాకింది. దాదాపు 97 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించింది. ఇప్పుడు ఈ వైరస్‌ ఇరాన్‌లో విజృంభించి మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 49 మంది మృతి చెందినట్లు ఆదేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు 194 మంది చనిపోయారు .

వైరస్‌ కారణంగా ఇటీవలే ఇరాన్‌ మాజీ దౌత్యాధికారి హోసేన్‌ షేఖోస్లామ్ మృతి చెందాడు. ఆ వార్త మరువక ముందే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన టెహ్రాన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చైనా తర్వాత ఇరాన్‌లోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 743 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,566కు చేరింది. ఫిబ్రవరి 19న దేశంలో తొలి కేసు నమోదైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 2,134 మంది వైరస్ బారినుంచి బయటపడ్డారు.ఇరాన్‌లో వైరస్‌ తీవ్రంగా ఉండడంతో అనేక గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలు తమ పౌరులను వెనక్కి తె చ్చాయి.

అటు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల సంఖ్య లక్ష దాటిపోగా 3500 మందికి పైగా చనిపోయారు. చైనాలో పురుడు పోసుకున్న ఈ వైరస్‌ ఇప్పుడు 97 దేశాలకు విస్తరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థను ఆందోళన వ్యక్తం చేసింది.. వేసవి కారణంగా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న అంచనాలకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని, అన్ని దేశాలూ వైరస్‌ కట్టడికి ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story