ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు.. దంపతుల అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు.. దంపతుల అరెస్ట్

CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన ఈ జంటకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖోరాసన్ ప్రావిన్స్‌తో(ఐఎస్‌కేపీ) సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఆత్మహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాకుండా, ఉగ్రదాడులకు పాల్పడేలా ముస్లిం యువతను ఈ దంపతులు ప్రేరేపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్‌ అయిన వారిలో శ్రీనగర్‌కు చెందిన జహన్‌జెబ్‌ సమి, అతని భార్య హీనా బషీర్‌లు అన్నారు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని జామియా నగర్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ దంపతుల నివాసంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిద్దరని అదుపులోకి తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని ఐసిస్‌ సభ్యులతో రెగ్యులర్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.. NRC, CAAకి వ్యతిరేకంగా ముస్లిం యువతను రెచ్చగొట్టడంతోపాటు, దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్నారని గుర్తించారు. జహన్‌బెబ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్‌ చేస్తుంది. జహాన్జీబ్ ఓ ప్రయివేట్ కంపెనీలో వర్క్‌ చేస్తుంది. ఈ దంపతులు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఇండియన్‌ మస్లిమ్స్‌ యూనిటీ పేరిట సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story