కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు మిలిటెంట్లను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాజ్‌పుర రేబాన్ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికలపై సైన్యానికి సమాచారం అందింది. వెంటనే రక్షక దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మనదేశంలోకి టెర్రరిస్టులను పంపించడానికి పాకిస్థాన్‌ కుట్రలు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పు లు జరుపుతూ ఉగ్రవాదులకు దారి క్లియర్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ కుట్రను పసిగట్టిన భారత సైన్యం తీవ్రంగా ఎదురుదాడి చేసింది.

ఢిల్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. నిఘా వర్గాలు, పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో భారీ ముప్పు తప్పిపోయింది. ఆత్మాహుతి దాడితో ఢిల్లీలో మారణహోమం సృష్టించడానికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. జామియానగర్‌లో ఉంటున్న జహన్‌జేబ్ షమీ, హీనా బషీర్‌బేగ్‌లను అరెస్టు చేశారు. ఈ ఇద్దరికి ఐసిస్‌తో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఢిల్లీలో సూసైడ్ అటాక్స్‌కు ప్లాన్ చేశారని పోలీసులు వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా బాంబు దాడులు చేసేలా ముస్లిం యువతను ప్రేరేపిస్తున్నారని వివరించారు. దీంతోపాటు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని పోలీసులు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story