కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత.. విషాదంలో పార్టీ శ్రేణులు

కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత.. విషాదంలో పార్టీ శ్రేణులు
X

కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే గతవారం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.

హన్స్‌రాజ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కేరళ, కర్ణాటక గవర్నర్‌గా పనిచేసిన భరద్వాజ్ గతంలో కేంద్ర న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. హన్స్‌రాజ్ మరణంతో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి, రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం తెలిపారు.

Tags

Next Story