ఎస్టీ ఓటర్లు లేకపోయినా సర్పంచ్ పదవి వారికే రిజర్వ్ చేయడంతో ఖంగుతిన్న ప్రజలు

ఎస్టీ ఓటర్లు లేకపోయినా సర్పంచ్ పదవి వారికే రిజర్వ్ చేయడంతో ఖంగుతిన్న ప్రజలు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు. సర్పంచ్‌గా ఎస్టీ రిజర్వేషన్‌ ప్రకటించడంతో ప్రజలు ఖంగుతిన్నారు. ఎస్టీ ఓటర్లు లేకపోయినా.. ఎస్టీ రిజర్వ్ ను ప్రభుత్వం ప్రకటించడంతో ఆందోళన చేపట్టారు. గత ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్‌ ప్రకటించడంతో ఎన్నికలను ఆ గ్రామస్తులు బహిష్కరించారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎస్టీ అభ్యర్ధిని మార్చకుంటే ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉంటామని హెచ్చరించారు.

Tags

Next Story