ఆంధ్రప్రదేశ్

మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి

మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి
X

మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న ఆత్మహత్యకు పాల్పడిన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. ఈ నివేదికలో మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలనూ వైద్యులు గుర్తించలేదని తెలుస్తోంది.

అయితే బ్రెయిన్ డెడ్ కారణంగానే ఆయన మరణించారని పేర్కొన్నారు. అందుకు విషం తీసుకోవడమే కారణమని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES