గ్రామ వాలంటీర్లతో ఓటర్‌ స్లిప్‌లు, డబ్బులు పంచుతున్నారు : బొండా ఉమ

గ్రామ వాలంటీర్లతో ఓటర్‌ స్లిప్‌లు, డబ్బులు పంచుతున్నారు : బొండా ఉమ

వైసీపీ సర్కారుపై ఘాటుగా విమర్శలు చేశారు టీడీపీ నేతలు. వైసీపీకి మరో ఛాన్స్‌ ఇస్తే.. మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లేనన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. స్థానిక ఎన్నికలపై 10 ప్రశ్నలతో కరపత్రాన్ని విడుదలు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు వర్లరామయ్య..

గ్రామ వాలంటీర్లతో ఓటర్‌ స్లిప్‌లు, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు బొండా ఉమ. వైసీపీకి ఓటు వేయాలని గ్రామవాలంటీర్లతో ప్రచారం చేయిస్తున్నారన్నారు. అధికారులను ఉపయోగించుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. తప్పుడు కేసు పెట్టి ... టీడీపీ నేతల్ని వేధిస్తున్నారన్న ఆయన... ఏపీలో మద్యం ఏరులై పారుతోందన్నారు.

టీడీపీ అభ్యర్ధులపై కేసులు పెట్టి.. పోటీలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ విమర్శంచారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని.. రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారాయన. వాలంటీర్లు వైసీపీ మాటలు విని భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, వైసీపీ కుట్రలను తిప్పికొడాతమన్నారు టీడీపీ నేతలు.

Tags

Next Story