స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది : మధు

X
స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. టీడీపీతో పొత్తు కోసం సంప్రదింపులు చేస్తున్నామని సీపీఐ నేతలు చెప్పడం సరికాదన్నారాయన. మా పార్టీ విషయం వారికి ఎందుకని ప్రశ్నించారాయన. టీడీపీ, వైసీపీ రెండు బీజేపీతో అంటకాగుతున్నాయన్నారు. మాకు పొత్తు ఉంటే ప్రజాసంఘాలు, బీఎస్పీ, లోక్‌సత్తా వంటి పార్టీలతోనేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి తప్పదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
