కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య

కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీని కలిసిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను ఆయన సోనియాగాంధీకి పంపారు. కాంగ్రెస్‌లో ఉండి ప్రజాసేవ చేయలేకపోతున్నానని.. ఏడాది కాలంగా తాను రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు లేఖలో పెట్టారు. ఆ లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే నిన్ననే ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేశారు.

సింధియా రాజీనామాలో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సంర్కార్‌ పడిపోయే ప్రమాదంలో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఇతర పక్షాల మద్దతుతో 114 సీట్లు ఉన్నాయి.. ఇప్పుడు సింధియాకు 17 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారంతా ప్రభుత్వం నుంచి వైదొలిగితే.. ప్రభుత్వం పడిపోవడం ఖాయం.

Tags

Read MoreRead Less
Next Story