గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పకడ్బందీ వ్యూహం

గ్రేటర్‌ విశాఖ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ పకడ్బందీ వ్యూహం

గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది అధికార వైసీపీ. గడచిన ఎన్నికల్లో నష్టపోయిన నాలుగు నియోజకవర్గాలపై కన్నేసిన జగన్‌ పార్టీ.. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. నోటిఫికేషన్ వచ్చేనాటికే అంతా సిద్దం చేసుకున్న అధికారపార్టీ.. ఇప్పటికే వార్డుల పునర్విభజనను తమకు అనుకూలంగా మలుచుకుంది. బలహీనమైన వార్డులను దారికి తెచ్చుకునేందుకు పక్కా వ్యూహంతో వార్డులను పునర్వభజించారు.

ఈనేపథ్యంలో టీడీపీకి బలంగా వున్న వార్డులను అడ్డగోలుగా విభజించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక, భీమిలి నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే వార్డుల్లో ఎస్సీ అభ్యర్ధులకు ఒక్క సీటు కూడా లేకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర నియోజక వర్గంలోకి వచ్చే వార్డుల్లో 4 చోట్ల ఎస్సీ ఓటు బ్యాంక్ పై కన్నేసిన వైసీపీ.. టీడీపీ నుంచి పోటీ చేసే బలమైన అభ్యర్ధులకు ఎరవేసేయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సన్నిహితుల నుంచి కబురు పెట్టి నేరుగా వైసీపీలోకి చేర్పించి సీట్లు కేటాయించేలా పావులు కదుపుతోంది. టీడీపీలో అసంతృప్తులను అక్కున చేర్చుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

ఈనెల 11, 12, 13 తేదీల్లో నామినేషన్లు జరుగనున్న నేపథ్యంలో వైసీపీ స్పీడు పెంచింది. గడువు తక్కువగా వుండటంతో టీడీపీ నుంచి జంపింగ్ లపై భారీ ఆశలు పెట్టుకుంది. జంపింగ్ లతో టీడీపీ మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీయొచ్చన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది వైసీపీ.

Tags

Read MoreRead Less
Next Story