సంక్షోభంలో కమల్‌నాథ్ ప్రభుత్వం

ప్రస్తుత మధ్యప్రదేశ్ రాజకీయాలు.. కర్నాటకలో గత ప్రభుత్వ పరిస్థితులను తలపిస్తున్నాయి. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగురవేయడం. దీంతో కూటమికి మెజారిటీ లేక ప్రభుత్వం నుంచి దిగిపోవడం.. అనంతరం బీజేపీ మళ్లీ అధికారాన్ని చేపట్టడం జరిగిపపోయాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ పాలిటిక్స్‌లో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని లాక్కోస్తున్న కమల్‌నాథ్ సర్కార్‌కి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. 18మంది తిరుగుబావు ఎగురవేయడంతో రాజకీయ సంక్షోభం తెలెత్తింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది.
గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహరం సోమవారం నాటికి మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. సడెన్‌గా బెంగళూరులో ప్రత్యేక్షం కావడం కలకలం రేపింది. సింధియా అండతో రెబెల్ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. వీరు మరో 48 గంటల్లోగా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బీజేపీ కుట్రపన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారని.. ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరిపడే బలం లేదని బీజేపీ వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో సీఎం కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సింధియా వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తునట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. కమల్‌నాథ్ నేతృత్వంలోని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 114 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది.. స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుల మద్దతుతో ప్రభుత్వం నెట్టకొస్తోంది. బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో ఓ పదిమంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజేపీ అప్రమత్తమైంది. మంగళవారం ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటుకు ఆదేశిచింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి.. పావులు కదపనున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com