తెలంగాణలో పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తున్న బీజేపీ

తెలంగాణలో పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తున్న బీజేపీ

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం సాధించిన త‌రువాత ఆ టెంపోను కొన‌సాగించ‌డంలో విఫ‌లమైంది తెలంగాణ బీజేపీ. లోక్ స‌భ ఎన్నికల్లో 20శాతం ఓటింగ్ షేర్ సాధించిన ఆ పార్టీ.. ఆ త‌రువాత జ‌రిగిన స్థానిక సంస్థలు, పంచాయితీలు, మున్సిపాలిటీల్లో ఆ షేర్ ను నిలుపుకోలేకపోయింది. దీంతో పార్టీలో కొత్త ఉత్తేజం నిపేందుకు రాష్ట్ర నాయ‌క‌త్వం నిర్ణయించింది. గ‌త కొన్ని నెల‌లుగా పెండింగ్ లో పెట్టిన పార్టీ సంస్థాగ‌త నియామ‌కాలు చేప‌డుతోంది. పార్టీ క‌మిటీల ఏర్పాటును వేగ‌వంతం చేసింది. జిల్లా అధ్యక్షుడు, మండ‌ల అధ్యక్షులు, క‌మిటీల నియామ‌కంపై దృష్టి పెట్టింది.

మొద‌ట‌గా జిల్లా అధ్యక్షుల ప‌ద‌వుల నియామ‌కం చేప‌ట్టింది. ఒకే సారి 19 జిల్లాల‌కు అధ్యక్షుల‌ను నియ‌మించింది. ఇందులో ఏడుగురు మాత్రమే పార్టీలో ఉన్నవారు కాగా.. మిగిలిన వారంతా పార్టీలో కొత్తగా చేరిన వారే. అదిలాబాద్ పాయల్ శంక‌ర్, నిర్మల్ డాక్టర్ కొడ‌కంటి ర‌మాదేవి, కొమ‌రం భీం ఆసిఫాబాద్ జేపీ ఫెడెల్, క‌రీంన‌గ‌ర్ బాస‌ స‌త్యనారాయ‌ణ‌, సంగారెడ్డి ఎం న‌రేంధ‌ర్ రెడ్డి, రంగా రెడ్డి బొక్కా న‌ర్సింహారెడ్డి, యాదాద్రి భూవ‌న‌గిరి పీవీ శ్యాంసుంధ‌ర్ రావ్, వ‌రంగ‌ల్ అర్బన్ రావు ప‌ధ్మ, న‌ల్లగొండ జిల్లా శ్రీ‌ధ‌ర్ రెడ్డి లు గ‌తంలో నుండి పార్టీ కి సేవ‌లందిస్తున్నారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొన‌సాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఒక పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా అధిష్టానం పెద్ద పీఠ వేసింది. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌రువాత పార్టీలోకి పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీల నుండి చేరిపోయారు. వీరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేశారు. గ‌తంలోనూ పార్టీలోకి వచ్చిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనందున ఇప్పుడు కూడా కొత్తవారికి అధ్యక్షలుగా అవ‌కాశం ఇస్తారా అన్నా అనుమానం ఉండేది. ఈ అనుమానాలు ప‌టాపంచలు చేస్తూ కొత్తగా పార్టీలో చేరిన వారికి అధ్యక్ష బాధ్యత‌లు క‌ట్టబెట్టింది. కొత్తగా పార్టీలో చేరిన నిజామాబాద్ కు చెందిన బ‌స్వపురం ల‌క్ష్మీన‌ర్సయ్య, పెద్దప‌ల్లి జిల్లాకు సోమార‌పు స‌త్యనారాయ‌ణ‌, నాగ‌ర్ క‌ర్నుల్ సుధాక‌ర్ రావ్, జోగులాంభ గ‌ద్వాల కు రాంచంధ్రా రెడ్డి, వ‌రంగ‌ల్ రూర‌ల్ కొండేటి శ్రీ‌ధ‌ర్, జయ‌శంక‌ర్ భూపాల ప‌ల్లి యోగేశ్వర్, జ‌న‌గాం ఆరుట్ల జ‌ష్వంత్ రెడ్డి, బ‌ద్రాద్రి కొత్తగూడెం కోనేరు స‌త్యనారాయ‌ణ , మంచిర్యాల ర‌ఘునాథ రావ్ ల‌కు పార్టీ జిల్లా అధ్యక్షప‌ద‌వుల‌ను అప్ప‌జెప్పింది. పార్టీలో చేరేముందే వారికి ఇచ్చిన హామీల‌తో పాటు , పార్టీ పెద్దల స‌హ‌కారంతో వీరికి ప‌ద‌వులు ద‌క్కిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కొత్తగా వ‌స్తున్న పార్టీ ప‌ద‌వుల‌తో అయినా నేత‌లు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా లేక ఎప్పటి లాగానే ప‌ద‌వుల‌ను అలంకార ప్రాయంగా మార్చుకుంటారనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story