పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు హల్‌చల్
చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఎంపీటీసీ పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థులపై బూతుపురాణం మొదలుపెట్టారు. నామినేషన్ల కేంద్రం నుంచి బలవంతంగా అభ్యర్థులను బయటకు పంపేశారు. మంత్రి అనుచరులు రెచ్చిపోతున్నా.. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూశారు. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యంతో.. ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల వీరంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ఆయన మంత్రి పదవికి అనర్హుడని మండిపడ్డారు. పెద్దిరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని.. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సదుంలో వైసీపీ అభ్యర్థులు తప్ప మిగిలిన వారెవరూ నామినేషన్లు దాఖలు చేయకుంటే ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు.
మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు టీడీపీ ఇంఛార్జష్ అనీషారెడ్డి. సొంత నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవం చేసేందుక ప్రయత్నిస్తుమన్నారు. బెదిరింపులకు తాను పడేదే లేదన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు
మొత్తానికి చిత్తూరు జిల్లాలో వైసీపీ, నేతలు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతునే ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com