చిత్తూరు జిల్లాలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పెద్దిరెడ్డి అనుచరులు

చిత్తూరు జిల్లాలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పెద్దిరెడ్డి అనుచరులు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు శృతిమించుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు తప్ప .. మిగితా పార్టీల నేతలు నామినేషన్ వేయకుండా పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు కులం, హాజ్ ట్యాక్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వమని బహిరంగంగానే చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.

Tags

Next Story