లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి

లోయలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో బస్సు లోయలో పడింది. దీంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన చంబా సదర్ ప్రాంతంలోని చెహ్లి గ్రామంలో జరిగింది. మంగళవారం ఉదయం 6.45 గంటల సమయంలో హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) బస్సు డెహ్రాడూన్ నుంచి చంబాకు వెళుతుండగా జార్జ్ లోయ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా లోయలోకి బోల్తాపడింది.

దీంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించగా 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో చికిత్స కోసం చంబా వైద్య కళాశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతులను యోగేశ్ కుమార్ (47), రాజీవ్ కుమార్ (37), మణిరామ్ (33), దావత్ అలీ (30), పూజా కుమారి (28) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story