42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదు : పంచుమర్తి అనురాధ

42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదు : పంచుమర్తి అనురాధ

వైసీపీ రంగులపై హైకోర్టు తీర్పు సీఎం జగన్‌కు చెంపపెట్టు లాంటిందన్నారు టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ. టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేశారన్నారు. ఇప్పటికి 42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రంగులు వేయడానికి, తీయడానికి 3వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. జగన్ తుగ్లక్ చర్యలతో ఏపీకి తీరని నష్టం జరుగుతోందన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతోందన్నారు.

Tags

Next Story