ఆంధ్రప్రదేశ్

నామినేషన్లు వేయకుండా వైసీపీ గుండాలు అడ్డుకుంటున్నారు : భానుప్రకాష్‌రెడ్డి

నామినేషన్లు వేయకుండా వైసీపీ గుండాలు అడ్డుకుంటున్నారు : భానుప్రకాష్‌రెడ్డి
X

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందంటూ మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భాను ప్రకాష్‌రెడ్డి. సదుం బీజేపీ నేత, ఎంపీటీసీ అభ్యర్ధి హరిబాబుపై వైసీపీ నాయకుల దౌర్జన్యంపై చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు భానుప్రకాష్‌రెడ్డి. నామినేషన్లు వేయకుండా వైసీపీ గుండాలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలు లాక్కొని వైసీపీ నేతలు దాడి చేయడం చూస్తే.. ఎన్నికలు ఏ మేరకు పారదర్శకంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందా అని ప్రశ్నించారు.

సదుం ఘటనపై.. సుమోటో కేసు నమోదు చేసినట్లు తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌. దీనిపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద బందోబస్తులో ఉన్న సదుం పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టెబుల్‌ ద్వారా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES