బీజేపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడులు

బీజేపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడులు

ఏపీలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులపై దౌర్జన్యానికి దిగుతూ.. ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు..నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం పంచాయతీలోని బీజేపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయి.. మనెమ్మ, మణికంఠ అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు..

స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపేందుకు వైసీపీ ఎందుకు భయపడుతోందని నిలదీశారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ. పోటీ చేసే అభ్యర్థులపై దాడులు, ఇతర పార్టీల వారికి సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులతో భయపెట్టడం, గ్రామ వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం చూస్తుంటే..వైసీపీ అభద్రతా భావం అర్థమవుతోందని అన్నారు.

Tags

Next Story