మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. బుద్ధా వెంకన్న, బోండా ఉమ కార్లపై దాడి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు అడ్డుకుంటున్న వైసీపీ వర్గీయులు.. ఇప్పుడు నేరుగా దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమల కారుపై దాడికి పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు.. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో నేతలు గాయాలపాలయ్యారు. వైసీపీ వర్గీయుల దాడిలో కారు పూర్తిగా ధ్వంసంమైంది.
మంగళవారం మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఆ ఘటనపై చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలను పరామర్శంచేందుకు మాచర్లకు వెళ్తున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తే.. అక్కడ ఎవరూ లేరంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com