తెలంగాణలో కంట్రోల్ అవుతున్న కరోనా వైరస్ వ్యాప్తి

కరోనా వైరస్ ప్రభావిత రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే.. తెలంగాణలో మాత్రం వైరస్ వ్యాప్తి కంట్రోల్ లో ఉంది. ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదు అయితే..అతను కూడా కోలుకుంటున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కరోనా కేసులు లేవని అన్నారాయన.
ఇక బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పూర్తిగా నయమైందన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా నెగెటివ్ వచ్చిందని.. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక, కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈటెల తెలిపారు. ఎయిర్ పోర్టులో ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక ఐసీయూలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు గాంధీలో మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉస్మానియాలో కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అసలు మన వాతావరణంలో కరోనా నశించిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే..ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ స్టేజ్ లో ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com