కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్‌‌ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరో ముగ్గుర్ని నియమించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా కొనసాగుతారని ఈ ప్రకటనలో తెలిపింది. కొత్త అధ్యక్షుడి కోసం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. టీపీసీసీ పదవి కోసం తెలంగాణాలో చాలా మంది రేసులో ఉన్నారు. అయితే.. కర్నాటకాలో కొత్త అధ్యక్షుడిని నియమించటంతో తెలంగాణాలో కూడా కొత్త నాయకత్వాన్ని.. పార్టీ అధిష్టానం ప్రతిపాదిస్తుందని టీ కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నారు.

Tags

Next Story