తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు : ఈటల

తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు : ఈటల

తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పూర్తిగా నయమైందన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా నెగెటివ్ వచ్చిందని.. బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక, కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈటెల తెలిపారు. ఎయిర్ పోర్టులో ప్రతి ప్రయాణికుడిని స్క్రీనింగ్ చేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక ఐసీయూలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story