అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ప్రదీప్ రెడ్డి.. ఆనంద్ రెడ్డి తో పాటు అతని సోదరుడు కృష్ణారెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఓ లావాదేవీ వ్యవహారంలో రూ.80 లక్షలు ఇస్తానంటూ ప్రదీప్‌, ఆనంద్‌ను భూపాలపల్లికి పిలిచాడు. భూపాలపల్లికి ఆనంద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి సహా మరికొందరు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నాక.. భూమి, డబ్బుల గురించి డిస్కస్ చేద్దామని చెప్పి రాంపూర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి ఆనంద రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడే ఆనంద్ రెడ్డి కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు వెనక్కికట్టేసి గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి.. కారును సర్వీసింగ్ చేయించారు. ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సహా నిందితులు పరారీలో ఉండగా.. ఒక నిందితుడు మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తమదైనశైలిలో విచారిస్తే నేరాన్ని అంగీకరించాడు. ఆనంద్ రెడ్డిని గొంతుకోసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అయితే భూమి చూడటానికి రావాలని ఆనంద్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని కూడా పిలిపించినట్లు తెలుస్తోంది. అడవిలో సిగ్నల్ దొరకక పోవడంతో చాలా సేపు వైట్ చేసి ఆనంద్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వెనుదిరిగాడు.

ఇది ఇలా ఉంటే ఆనంద్ రెడ్డి హత్య కేసులో సీఐ ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఆనంద్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సోదరుడే ప్రశాంత్ రెడ్డి. ఈయన హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ ప్రశాంత్ రెడ్డి స్పందించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు కలిచివేశాయని ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు. తన 24 ఏళ్ల సర్వీసులో ఏ చిన్న తప్పు కూడా చేయలేదని, ఇలాంటి ఆరోపణ ఎప్పుడు రాలేదని స్పష్టంచేశారు. కానీ ఆనంద్ రెడ్డి హత్య కేసులో తన పేరు రావడం బాధ కలిగించిందని చెప్పారు. నిజానిజాలు తెలుసుకొని, ఆధారాలతో వార్తలు వెయ్యాలి అని కోరారు ప్రశాంత్ రెడ్డి.

[audio mp3="http://tv5news.in/wp-content/uploads/2020/03/Anand-Audio-Call.mp3"][/audio]

Tags

Read MoreRead Less
Next Story