తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ నియమితులయ్యారు. యువతలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న బండి సంజయ్‌... ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సంబంధాలున్న వ్యక్తి. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిన ఆయన‌.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన సంజయ్‌.. దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిగా సుపరిచితులు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తున్న పార్టీ అధిష్టానం.. తెలంగాణ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించింది.

Tags

Next Story