సీఎం జగన్ నిర్ణయంపై తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్న బీసీ సంఘాలు
అధికారంలోకి వస్తే బీసీలకు రాజకీయ సాధికారత కల్పిస్తామని ఎన్నికల ముందు తెగ హామీలు ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు వెనబడిన వర్గాలకు మొండిచేయి చూపించారని అనంతపురం జిల్లాకు చెందిన బీసీ సంఘాల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను.. 24 శాతానికి తగ్గించబడ్డాయని వాపోతున్నారు. కోటా 10శాతం తగ్గడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
ప్రభుత్వ అసమర్ధత వల్లే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం తగ్గిందని వెనబడిన వర్గాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల కాలంలో అమలైన 34శాతం బీసీ కోటాను కొనసాగించడంలో.. హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కావాలనే ప్రభుత్వం ఇలా చేసిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా ఈ ఎన్నికల్లో 15 వందల మంది బీసీల నేతలు.. పోటీ చేసే హక్కును కోల్పోయారని మండిపడ్డారు.
సీఎం జగన్.. వెనకబడిన వర్గాలపై చిన్నచూపు చూస్తున్నారని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో 60 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూసి.. రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేస్తానన్న జగన్.. ఇప్పుడు మాట నిలబెట్టుకోలేదని దుయ్యబడ్డారు. టీడీపీకి అండగా ఉండే బీసీలు.. జగన్ మాయమాటలకు నమ్మి మోసపోయారన్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం 50శాతం మించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో,, బీసీ జనాభాను కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో న్యాయమూర్తిని కన్విన్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని న్యాయబద్ధంగా వాధించి ఉంటే ఈ పరిస్తితి వచ్చేదికాదన్నారు. 15వందల మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.. రాజకీయ పదువులకు కోల్పోయే వారుకాదని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ కుట్ర కాదా అంటూ ఫైర్ అవుతన్నారు.
ఏపీ స్తానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెనకబడిన వర్గాలను అణిచివేయాలనే కుట్రతోనే సీఎం జగన్ ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బీసీలు కళ్లు తెరచి న్యాయపోరాటం చేయాలని కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com