బీసీల పట్ల తన నైజాన్ని చాటుకున్న జగన్‌ ప్రభుత్వం

బీసీల పట్ల తన నైజాన్ని చాటుకున్న జగన్‌ ప్రభుత్వం
X

బీసీలకు రాజ్యాధికారం నుంచి మరింత వెనక్కి నెట్టడంలో జగన్‌ ప్రభుత్వం తన నైజాన్ని చాటుకుంది. బీసీలపై ప్రేమ ఒలకపోస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్‌.. రిజర్వేషన్ల పరంగా బీసీలకు జరిగే అన్యాయంపై సుప్రీంకోర్టులో కేవియట్‌కు ఎందుకు వెళ్లలేదన్నది పెద్ద ప్రశ్న. తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుంది వైసీపీ ప్రభుత్వ వైఖరి. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 32 శాతం ఇవ్వాలి. 2010లో కిరణ్‌ సర్కారు కూడా 35 శాతానికి కట్టుబడింది. కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. విశాఖజిల్లాలోనే చూస్తే బీసీలు ఎంత నష్టపోతున్నారో అర్థమవుతుంది. జీవీఎమ్సీ ఎన్నికల్లో 98 వార్డుల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలై ఉంటే... 33 సీట్లు బీసీలకు దక్కేవి. కానీ ఆ శాతం ఇప్పుడు 24 కి పడిపోయింది. దీంతో 23మందికి మాత్రమే అవకాశం లభించింది. పది మంది బీసీలు పోటీకి దూరమయ్యారు.

ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మొత్తం 39 స్థానాలు ఉంటే.. అందులో 13 స్థానాలు బీసీలకు దక్కాల్సి ఉండగా 10 మందికి బీసీలే పోటీ చేస్తున్నారు. ఇక 651 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీసీలకు 221 దక్కాల్సి ఉంది. కానీ ఇప్పుడు 156 స్థానాల్లోనే బీసీలు పోటీ చేయాల్సిన దుస్థితి. గ్రామపంచాయతీలదీ ఇదే పరిస్థితి. మొత్తం 950 పంచాయతీలకు 323 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా.. ఇప్పుడు 228 స్థానాలకే పరిమితమయ్యారు బీసీలు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నాయి విపక్షాలు.

Tags

Next Story