హీరో విజయ్‌కి ఐటీ శాఖ షాక్

హీరో విజయ్‌కి ఐటీ శాఖ షాక్

తమిళ హీరో విజయ్‌కి ఐటీ శాఖ మళ్లీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులో మరోసారి విజయ్ నివాసం లో సోదాలు నిర్వహించారు. చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు, ఆదాయపు లెక్కలపై ఆరా తీశారు. సినిమాల ద్వారా వస్తున్న ఆదాయం, పన్ను చెల్లింపులపై సమాచారం సేకరించారు. పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలపై వివరాలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే మాస్టర్ సినిమా సహ దర్శకుడు లలిత్ కుమార్ నివాసంలో సోదాలు జరిగాయి. ఈ సినిమాలో హీరోగా విజయ్ నటిస్తున్నారు. కో డైరెక్టర్‌ ఇంట్లో తనిఖీల తర్వాత విజయ్ ఇంట్లో సోదాలు జరగడం విశేషం.

విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. ఫిబ్రవరి విజయ్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. విజయ్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మరీ ఆయన్ను ప్రశ్నించారు. విజయ్‌ తో పాటు AGS ఫైనాన్షియన్ అన్బుచెళియన్ ఇల్లు, కార్యాలయాలు, స్క్రీన్ సీన్ సంస్థల్లో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 75 కోట్ల రూపాయల మేర లెక్క చూపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి విజయ్ ఇంట్లో సోదాలు చేయడం కలకలం రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story