వైసీపీ రాక్షస పాలనకి మాచర్ల ఘటన పరాకాష్ట : లోకేష్

X
వైసీపీ రాక్షస పాలనకి మాచర్ల ఘటన పరాకాష్ట అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోందన్నారు. టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయని ఫైర్ అయ్యారు. ఆ ఇద్దరిని హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
హైకోర్టు అడ్వకేట్ కిషోర్పైనా ఘోరంగా దాడిచేశారని అన్నారు లోకేష్. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూన్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అరాచకం సృష్టిస్తున్నారని.. చివరికి పోలీసులపైనా దాడి చేసేపరిస్థితి వచ్చిందన్నారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు లోకేష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
