రిటర్నింగ్ అదికారి శోభారాణిని నిలదీసిన సబ్బం హరి
By - TV5 Telugu |12 March 2020 5:20 PM GMT
ప్రభుత్వం రౌడీరాజ్యం నడుపుతోందని టీడీపీ నేత సబ్బంహరి మండిపడ్డారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలో జరిగిన వైసీపీ దౌర్జన్యకాండపై ఆయన ఆరా తీశారు.స్యయంగా కార్యాలయానికి వెళ్లి కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నేతల ధోరణిపై రిటర్నింగ్ అదికారి శోభారాణిని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోలీసులను ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలుగా మార్చిందని అసహనం వ్యక్తం చేశారు. 'నా 34ఏళ్ల రాజకీయ జీవితంలో15 ఎలక్షన్లు చూశానని ఇంత అన్యాయంగా ఏ ప్రభుత్వమూ ప్రవర్తించలేదని' సబ్బం హరి ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రత్యర్ధులు వారి వెంటబడి దాడులు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com