ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్లు.. పలుచోట్ల వివాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ అనంతరం...నామినేషన్ల పరీశీలన జరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల పోటీ కొనసాగుతోంది. పత్తికొండలో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీల నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయన్న సమాచారంతో.. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో టీడీపీ ఇంఛార్జ్ కేఈ శ్యాంబాబు అక్కడికి చేరుకున్నారు. అన్ని సర్టిఫికెట్లు ఇచ్చినా ఎందుకు రిజెక్ట్ చేశారని ప్రశ్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు రాంమోహన్‌రెడ్డి రావడంతో... ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
అటు... చిత్తూరు జిల్లా రేణిగుంట ఎంపీడీవో కార్యాలయ వద్ద వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అనుచరులు... ఏకంగా బీజేపీ నేతలపై దాడులు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల నామినేషన్ల అవకతవకలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు టీడీపీ నేతలు దూళిపాళ్ల నరేంద్ర, మన్నవ సుబ్బారావు. పొన్నూరు మండంలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు పెడుతున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి.. స్థానిక సంస్థల్లో వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21న పోలింగ్ జగరనుంది. ఫలితాలు ఈ నెల 24న తేలనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com