భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ వాడివేడిగా సాగింది..బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. యూపీఏ పాలనపై విసుగుతోనే దేశ ప్రజలు బీజేపీకి ఓటేశారని అన్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్నిఆ పార్టీ తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యాయని చెప్పారు. CST పేరుతో కాంగ్రెస్‌, GST పేరుతో బీజేపీ రాష్ర్టాలకు నిధులను ఎగ్గొట్టాయని ఆరోపించారు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ర్టానికి ఏ సంవత్సరంలోనూ 10 వేల కోట్లు ఇవ్వలేదని అన్నారు సీఎం కేసీఆర్.

ఉమ్మడి రాష్ట్రంలో ఫలాలు అందలేదనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ మాత్రం అవగాహన లేకుండా అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ప్రతిపక్షాలకు మాత్రమే నిరాశ మిగిల్చిందిని విమర్శించారు హరీష్‌రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తని నేతలు..ఇప్పుడు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు హరీష్‌రావు.

పౌల్ట్రీ ఫెడరేషన్‌లో అక్రమాలు జరిగాయంటూ.. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను మంత్రి ఈటల రాజేందర్‌ ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. బడ్జెట్‌పై చర్చ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story