బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్‌ 13వ సీజన్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడో తెలుసా?

బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్‌ 13వ సీజన్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడో తెలుసా?

ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వైరస్ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద కూడా పడింది. కోరనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 వాయిదా పడింది. భారత్‌ వేదికగా మార్చి 29వ తేదీన ప్రారంభం అవనున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌‌ను వాయిదా వేసింది గవర్నింగ్ కౌన్సిల్. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీలకు గవర్నింగ్ కౌన్సిల్ సూత్రపాయంగా తెలిపింది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌ ను నిర్వహించలేమంటూ పలు రాష్ట్రాలు చేతులెత్తాశాయి.

కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ఇప్పటికే జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్‌ ఈవెంట్లు కూడా రద్దు అయ్యాయి. ఎక్కువగా జనాభా గుమికూడే పరిస్థితులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా ప్రభావిత దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే టోక్యో 2020 ఒలింపిక్స్‌ కూడా వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story