గుంటూరు జిల్లాలో మద్యం రాజకీయం

గుంటూరు జిల్లాలో మద్యం రాజకీయం

స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గుంటూరు జిల్లాలో మద్యం రాజకీయం నడుస్తోంది. తెనాలి నాలుగో వార్డు నుంచి టీడీపీ తరపున పోటీచేస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ మద్యం బాటిళ్లను వైసీపీ నేతలే పెట్టారని అభ్యర్థి ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో గుర్తుతెలియని వ్యక్తుల కదలికలను పోలీసులు గుర్తించారు. ముఖానికి ముసుగు వేసుకుని కొందరు వ్యక్తులు గోడ దూకి మద్యం బాటిల్స్‌ పెట్టినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.

Tags

Next Story