త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తా : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్

త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తా : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్

త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్. తన పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను కేవలం పార్టీ అధినేతగానే ఉంటానని.. సీఎం అభ్యర్థిగా మాత్రం వేరేవారిని నిల్చోబెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తలైవా. చదువు, విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంను చేస్తానంటూ ప్రకటించారు.

తనపై వచ్చిన ఊహాగానాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు రజనీకాంత్‌. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందన్నారు. రాజకీయాల్లోకి యువరక్తం రావాలని... పార్టీ, ప్రభుత్వంపై ఒకే వ్యక్తి పెత్తనం ఉండకూడదని అన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదన్న సూపర్‌ స్టార్‌.. ఆ పదవిపై తనకు వ్యామోహం కూడా లేదని చెప్పారు.

తమిళనాడులోని మక్కల్ మండ్రల్ ఆఫీస్ బేరర్లతో సమావేశమైన రజనీకాంత్‌.. రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమయానికి తగ్గట్టు పారిపలన సాగడం లేదన్నారు రజనీ. ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకే రాజకీయాల్లో అవకాశాలు వస్తున్నాయన్నారు. వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ప్రజల మనస్తత్వం కూడా మారాలని తెలిపారు.

Tags

Next Story