చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో పతనం అవుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా పతనం అవుతున్నాయి. కరోనా వైరస్ భయాలు ఇన్వెస్టర్లను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఇవాళ ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. నిక్కాయ్ అత్యధికంగా 8 శాతం నష్టాలలో ఉండగా.. ఆస్ట్రేలియా 6.5 శాతం... హ్యాంగ్‌సెంగ్ 5 శాతం... షాంగై 4 శాతం.. కోస్పి 7శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. మన స్టాక్ మార్కె ట్లు ఇవాళ భారీగా నష్టపోతున్నాయి. మే 2009 తర్వాత 10 శాతం పతనంతో ఏకంగా లోయర్ సర్క్యూట్ వద్ద.. సెన్సెక్స్ నిఫ్టీ లాక్ అయ్యాయంటే.. మార్కెట్లలో సెల్ ఆఫ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 3090 పాయింట్ల నష్టంతో 29687కు పడిపోగా.. 966 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 8624 వద్దకు చేరుకుంది. 2573 పాయింట్లు నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ 21397 వద్దకు పడిపోయింది. మొత్తం అన్ని సెక్టోరియల్ ఇండెక్స్‌లు 10 శాతం పైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్లు 9 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ నెగిటివ్‌గానే ఉన్నాయి. 20 శాతం నష్టంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా నష్టపోగా.. భారత్ పెట్రోలియం, హెచ్‌సీఎల్ టెక్, గెయిల్, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
డౌజోన్స్, నాస్‌డాక్ ఇండెక్స్‌లలో వెయ్యి, రెండు వేల పాయింట్ల శాతం మార్పులు సాధారణం అయిపోతోంది. నిన్న యూఎస్ మార్కెట్లు భారీ నష్టాలకు గురయ్యాయి. డౌజోన్స్ 10 శాతం నష్టంతో 2352 పాయింట్లు, నాస్‌డాక్ 9.4 శాతం, ఎస్ అండ్ పీ ఇండెక్స్ 9.5 పాయింట్లు నష్టపోయాయి. గత నెలలో గరిష్ట స్థాయి నుంచి పోల్చితే.. అమెరికా ఇండెక్స్‌లు 30 శాతం పతనం కావడం.. బేర్ మార్కెట్ గ్రిప్ ఏ విధంగా సూచిస్తోంది. డౌజోన్స్ ఫ్యూచర్స్ ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com