తాడిపత్రిలో హైటెన్షన్.. భారీగా మొహరించిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో.. అధికార పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు తిష్టవేసి కూర్చున్నారు. టీడీపీ తరఫున ఏ ఒక్కరు నామినేషన్ వేయకుండా హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు కూర్చున్నారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించివేశారు.
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తన వర్గీయులతో కలిసి మున్సిపల్ ఆఫీసు దగ్గర తిష్ట వేశారని తెలుసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. తాను కూడా హుటాహుటిన మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. జేసీ వర్గీయులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో.. పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీగా మోహరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com