క్షణాల్లో ట్రాపిక్ క్లియర్ చేసిన పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న ఇంటర్ విద్యార్థులు

క్షణాల్లో ట్రాపిక్ క్లియర్ చేసిన పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న ఇంటర్ విద్యార్థులు

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌-ఎల్బీనగర్‌ ప్రధాన రహదారిలోని కొత్తపేట వద్ద క్యాబ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తూ ముందు వరుసలో ఉన్న వాహనాలను ఢీ కొట్టాడు. దీంతో..వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అసలే ఇంటర్‌ పరీక్షలు, ఆపై ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్ధులు తీవ్రంగా టెన్షన్‌ పడ్డారు. సమాచారమందుకున్నఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన కొత్త పేటకు చేరుకుని క్షణాలలో ట్రాఫిక్‌ క్లీయర్‌ చేశారు. దీంతో.. విద్యార్ధులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. అతి తక్కువ సయంలో ట్రాఫిక్‌ క్లీయర్‌ చేసి విద్యార్ధులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా చేసిన ట్రాఫిక్‌ అదనపు ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లును అందరూ అభినందించారు.

Tags

Next Story