ఆంధ్రప్రదేశ్

యుద్ధరంగాన్ని తలపించేలా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు

యుద్ధరంగాన్ని తలపించేలా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
X

యుద్ధరంగాన్ని తలపించేలా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు జరగాల్సిన ఎన్నిక ప్రక్రియ కాస్తా అధికార పార్టీకి వైపు టర్న్ తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీ డామినేషన్ తో టీడీపీ అసలు రేసులో కూడా ఉండకుండాపోయింది. కుదిరితే బెదిరింపులు, లేదంటే అడ్డగింపులు, అభ్యర్ధుల కిడ్నాపులు, ప్రత్యర్ధి నామినేషన్ల పత్రాల చించివేతతో ఏపీలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్ల ఘట్టం ముగిసింది.

టీడీపీ అభ్యర్ధులను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ అరాచకాలు మరింత శృతి మించుతున్నాయి. తిరుపతిలో నామినేషన్ వేసేందుకు బయల్దేరిన టీడీపీ అభ్యర్ధి భారతిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. కారులో బలవంతంగా ఎక్కించుకొని పూతలపట్టు జాతీయ రహదారిపై వదిలేశారు. అయితే..సాయంత్రం 6 గంటలకు తిరుపతి చేరుకున్న భారతి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు.

కర్నూలు జిల్లాలో డోన్ మున్సిపల్ కార్పోరేషన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. అధికార పార్టీ అరాచకాలు, దాడులకు దూరంగా ఉండాలనే తానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డోన్ మున్సిపల్ కార్పోరేషన్ పదువులను వైసీపీకి దానంగా ఇస్తున్నామని అన్నారు.

విశాఖలో నగర బీజేపీ అధ్యక్షురాలికి కూడా అవమానం తప్పలేదు. బీజేపీ తరపున 91వ వార్డుకు ఎస్సీ మహిళకు కేటాయించటంతో ఆమె పోటీలో నిలబడ్డారు. అయితే..ఓటర్ కార్డు సరిగ్గా లేదంటూ తన నామినేషన్ను తిరస్కించారని మాధవి చార్లెస్ కన్నీరు పెట్టుకుంది.

వైసీపీ శ్రేణులను దాటుకొని వెళ్లి నామినేషన్లు వేసినా..అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. నక్కడపల్లి మండలం డొంకడా గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాయకరావుపేటలో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. పోలీసుల వేధింపులే ఇందుకు కారణమని పేర్కొన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గం పుంగనూరులో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బహిస్కరిస్తున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు.

Next Story

RELATED STORIES