దేశంలో తొలి కరోనా మరణం.. శనివారం నుంచి ఒక వారం పాటు బంద్‌

దేశంలో తొలి కరోనా మరణం.. శనివారం నుంచి ఒక వారం పాటు బంద్‌
X

బంద్.. బంద్.. బంద్.. ఇదేదో రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపు కాదు. ఓ రకంగా కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు స్వచ్చందంగా పాటిస్తున్న బంద్ ఇది. దేశంలోనే తొలి కరోనా మరణం రాష్ట్రంలో సంభవించడంతో.. యడియూరప్ప సర్కారు అప్రమత్తమైంది. శనివారం నుంచి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను మూసివేశారు. పార్కులు, పబ్‌లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను కూడా క్లోజ్ చేశారు. పెళ్లిళ్లు, పార్టీల్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప విదేశాలకు వెళ్లకూడదని ప్రభుత్వం సూచించింది. ప్రయాణాలు మానుకోవాలని, ఇంటి పట్టునే ఉండాలని కోరింది. అయితే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఆర్టీసీ, మెట్రో సేవలను మాత్రం యథావిధిగా కొనసాగించాలని యడియూరప్ప సర్కారు నిర్ణయించింది.

Tags

Next Story