ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికలు జరుగుతున్నాయి: విష్ణువర్థన్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికలు జరుగుతున్నాయి: విష్ణువర్థన్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలోలో పురపాలక సంఘ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న దౌర్జన్యాలపై... కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్ర హోంమంత్రి దిష్టిబొమ్మలా తయారయ్యారని... ఆమె వెంటనే రాజీనమా సమర్పించాలన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ 90 శాతం విజయం సాధించినా... అవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలుగానే తాము భావిస్తామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

Tags

Next Story