ఎస్ బ్యాంక్ కస్టమర్లకు భారీ ఊరట

ఎస్ బ్యాంక్ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఎస్ బ్యాంకు పునర్ వ్యవస్థీకరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎస్-బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 49 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇతర బ్యాంకుల నుంచి పెట్టుబడులను ఆహ్వానించారు. అలాగే, బ్యాంకు నుంచి నగదు విత్ డ్రాపై విధించిన మారటోరి యంను మూడు రోజుల్లో తొలగిస్తామని కేంద్రం ప్రకటించింది. వారం రోజుల్లో ఎస్ బ్యాంక్ బోర్డును పునరుద్దరిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏ ప్రకటించింది. ఈ ప్రకటనతో 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం లభించనుంది. ఉద్యోగుల నెల జీతం 720 నుంచి 10 వేల రూపాయల వరకు పెరగనుంది. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై సుమారు 14 వేల కోట్ల రూపాయల భారం పడనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com