అమరావతి కోసం ఎన్నాళ్లైనా ఉద్యమం : రైతులు

అమరావతి కోసం ఎన్నాళ్లైనా ఉద్యమం : రైతులు

అదే పోరాటం.. ఒకటే నినాదం.. అమరావతి కోసం ఎన్నాళ్లైనా ఉద్యమం కొనసాగుతుందంటున్నారు రాజధాని ప్రాంత రైతులు.. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.. 89 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడుతున్నారు.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, రాజధాని తరలింపును కచ్చితంగా అడ్డుకుంటామని వారు చెబుతున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నేతల దమనకాండపైనా రైతులు, మహిళలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు..

ఇక రాజధాని కోసం సుదర్శన హోమం నిర్వహించనున్నారు మందడం రైతులు, మహిళలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదర్శన హోమం జరగనుంది.. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో సుదర్శన హోమం నిర్వహించనున్నారు. హోమానికి 29 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు.

Tags

Next Story