పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అరాచకం

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అరాచకం

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభ పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రలోభాలకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు లొంగకపోతే.. దాడులకు బరి తెగిస్తున్నారు. జిల్లాలో మొత్తం 48 జడ్పీటీసీ నామినేషన్లలో రెండు స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో 46 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవాలంటూ వైసీపీ దౌర్జన్యాలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జంగారెడ్డి గూడెం జడ్పీటీసీ అభ్యర్థి నరసింహమూర్తిని కిడ్నాప్‌ చేశారని.. అలాగే ఏలూరు జడ్పీటీసీ అభ్యర్థిని విత్‌ డ్రా చేయించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎన్నికల పరిశీలకులు హిమాన్షు శుక్లాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story