స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని స్వాగతించిన మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని స్వాగతించిన మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలు వాయిదా వేయడాన్ని స్వాగతించారు.. మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూడడం దారుణమన్నారు. ప్రజాబలంతో కాకుండా పోలీసుబలంతో అధికార పార్టీ ఆయా ప్రాంతాల్లో ఏకగ్రీవం చేసుకుంది. పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంతోనే మాచర్ల సంఘటన జరిగిందన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం కాదు.. మొత్తం నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు చినరాజప్ప.

Tags

Next Story