ఏపీలో ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా

ఏపీలో ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు. ఆరు వారాల అనంతరం సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రమేష్ కుమార్ తెలియజేశారు. అయితే ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు కేవలం వాయిదా మాత్రమే పడ్డాయని రద్దు కాలేదని రమేష్ కుమార్ వెల్లడించారు.

Tags

Next Story