ఏపీలో గాంధీజి కలలు నెరవేరాయంట..!

ఏపీలో గాంధీజి కలలు నెరవేరాయంట..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అరచకాలు పెరిగిపోతున్నాయి.. దాడులు.. దౌర్జన్యాలతో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్‌ కూడా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల అధికార పార్టీకి పోలీసుల అండదండలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార జులుంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..

ఇంత జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాత్రం గాంధీజి కలలు నెరవేరాయి అంటున్నారు. అహింసా పరమో ధర్మహ అని అప్పట్లో గాంధీ పిలుపు ఇస్తే.. ఇప్పుడు అధికార వైసీపీ హింసే తమ ఆయుధం అంటోంది. కానీ ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు ఇలా జరగాలని గాంధీజీ కొరుకున్నారంటూ ఆయన కొత్త అర్థం చెబుతున్నారు.

Tags

Next Story