కరోనా ఎఫెక్ట్ .. ఉగాది ఉత్సవాలను నిలిపివేసిన అధికారులు

కరోనా ఎఫెక్ట్ .. ఉగాది ఉత్సవాలను నిలిపివేసిన అధికారులు

ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా ప్రభావం మనదేశంలోనూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో.. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్‌ మూసివేయగా.. జన సమూహాలు లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కరోనా ప్రభావం.. ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా తీవ్రంగా పడుతోంది. కర్నూల్‌ జిల్లాలో ఈనెల 22 నుంచి 26 వరకు జరగాల్సిన ఉగాది ఉత్సవాలపై.. శ్రీశైలం EO కె.ఎస్. రామారావు సమీక్ష నిర్వహించారు. ఉగాది సందర్భంగా జరగాల్సిన ప్రత్యేక పూజలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భక్తులు గుంపులుగా ఉండకుండా చూడాల్సి ఉందన్నారు. విదేశీ భక్తుల ఎవరూ శ్రీశైలం రావద్దని, ఎవరైనా విదేశాలకు వెళ్లివచ్చి ఉంటే.. కొన్నాళ్లపాటు శ్రీశైలం రావద్దని విజ్ఞప్తి చేశారు.

ఉగాది ముందు రోజు జరగాల్సిన వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశంతోపాటు ఉగాది రోజున కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు.. EO కె.ఎస్‌.రామారావు తెలిపారు. ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేశామన్నారు. ఉత్సవ రోజుల్లో.. వృద్ధ మల్లికార్జున స్వామివార్లకు జరిగే ఆర్జిత అభిషేకాలు, అమ్మవారి ఆలయ మండపంలో జరిగే ఆర్జిత కుంకుమార్చనలు కూడా రద్దు చేశారు. లోక కళ్యాణం కోసం సోమవారం నుంచి ప్రతిరోజు దేవస్థానం మృత్యుంజయ హోమం నిర్వస్తున్నామన్నారు EO కె.ఎస్.రామారావు.

Tags

Next Story