కరోనా వైరస్ వ్యాప్తితో మాస్క్‌లకు పెరిగిన గిరాకీ

కరోనా వైరస్ వ్యాప్తితో మాస్క్‌లకు మంచి గిరాకీ పెరిగింది. ఆరోగ్య భద్రత దృష్ట్యా.. ముందస్తు జాగ్రత్తలతో ప్రజలు మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది బ్లాక్ మార్కెట్ గాళ్లు.. మాస్క్‌ల కొరతను సృష్టిస్తున్నారు. దీనిద్వారా మాస్క్‌లకు ధరలను విపరీతంగా పెంచేశారు. పది రూపాయలు ఉండే మాస్కును 30 రూపాయలకుపైనే అమ్ముతున్నారు. ఇది సాధారణ ప్రజానికానికి కాస్త భారమైన పనే. దీన్ని గమనించిన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట గురుకుల పాఠశాల విద్యార్ధులు తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు. సామాజిక దృక్పథంలో వారే స్వయంగా మాస్కులను తయారు చేసి.. గ్రామ ప్రజలకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేస్తు అంందరి మన్ననలు పొందుతున్నారు.
కరోనా వైరస్ దృష్ట్యా మాస్కుల ప్రాధానత్యను గుర్తించిన నరసింహులపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్ధుల చేత కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. సామాజిక బాధత్య దృష్ట్యా.. విద్యార్ధులతో మాస్కులు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయించాలని సంకల్పించారు. స్వయంగా ప్రిన్సిపలే.. డిష్ పేపర్లను కొనుగోలు చేయించి, తక్కువ ఖర్చుతో విద్యార్ధుల చేత మాస్క్‌లను తయారు చేయించారు. అలా తయారు చేసిన మాస్కులను ఉచితంగా గ్రామస్తులకు పంపిణీ చేస్తున్నారు. పంపిణీ కార్యక్రమానికి వచ్చిన తహసీల్దార్.. విద్యార్ధుల కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

