హైదరాబాద్‌లో దుర్ఘటన.. భవనం కూలి వ్యక్తి మృతి
X
By - TV5 Telugu |16 March 2020 3:24 PM IST
హైదరాబాద్ కార్ఖానా ప్రధాన రోడ్డులో.. ఓ పాత భవన్ కూల్చివేసిన ఘటనతో.. ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. నెస్ట్ ఆసుపత్రిని ఆనుకుని.. ఓ పాతభవనం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఆర్ధరాత్రి సమయంలో.. జేసీబీతో పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా భవనంలోకి రెండో అంతస్తు కుప్పకూలింంది. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయలయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడం, పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. ఘటాన స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com