విశాఖలో తారాస్థాయికి చేరిన రాజకీయకక్షలు
గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో రాజకీయకక్షలు తారాస్థాయికి చేరాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై పోలీసులు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిని ఆటంకపరిచారంటూ MVP సీఐ షణ్ముఖరావు సదరు ఎక్సైజ్ సిబ్బంది నుంచి వాగ్మూలం తీసుకుని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. టీడీపీ సానుభూతిపరుల మద్యం వ్యాపారులపై అధికారపక్షం పన్నిన కుట్రను ఆదారాలతో సహా ఎమ్మెల్యే రామకృష్ణ బట్టబైలు చేశారు. 14 గంటల పాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం దీక్ష చేశారు. ఈపరిణామాలను పరిగణలోకి తీసుకుని వెలగపూడిపై కేసు నమోదు చేశారు.
విశాఖలో టీడీపీ మద్దతుదారులే టార్గెట్‌గా అధికారపక్షం ఎక్సైజ్ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేసి సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ వారికి చెందిన బార్‌ల నుంచి కాళీ సీసాలను తీసుకువెళ్లి చీప్ లిక్కర్‌ను మిక్స్ చేస్తున్నారనే కేసులు బనాయించాలని చూసి ఎక్సైజ్ సిబ్బంది భంగపడ్డారు. ఈ విషయం ఆధారాలతో సహా బైటకు రావడంతో.. సిబ్బంది దురాగతాలపై ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఎక్సైజ్ సూపరెండెంట్ కార్యాలయానికి వెళ్లారు. ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రాత్రంతా స్టేషన్‌లోనే బస చేశారు ఎమ్మెల్యే.
మరుసటి రోజు ACP ఆర్వీఎస్‌ఎన్.మూర్తి స్టేషన్‌కు చేరుకోవడంతో వెలగపూడి రామకృష్ణ బాబు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే అప్పటిదాకా స్టేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆటంకపరిచారంటూ MVP పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన రామకృష్ణ బాబు.. తమపై జరుగుతోన్న కుట్రలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com